Thursday, January 23, 2025

రాయ్‌పూర్ వన్డేలో విజృంభించిన భారత బౌలర్లు

- Advertisement -
- Advertisement -

రాయ్‌పుర్ వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్లు తడబడ్డారు. భారత్ బౌలర్లు ధాటికి తట్టుకోలేక పోయారు. 34.3 ఓవర్లకే ఆలౌట్ చేశారు. టీమిండియా బౌలర్లు 108 పరుగులకే కివీస్ ఆటకట్టించారు. న్యూజిలాండ్ జట్లు, భారత్ కు 109 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇండియన్ బౌలర్లలో సీనియర్ పేసర్‌‌ మహ్మద్ షమీకి 03 వికెట్లు, హర్దిక్ పాండ్యా 02, వాషింగ్టన్ సుందర్ 02, సిరాజ్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు. ఉత్కంఠభరితంగా సాగిన తొలి వన్డేలో అద్భుత విజయాన్ని భారత్ అందుకున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్ బ్యాటింగ్ లో ఫలిప్స్ 36, సాంట్నర్ 27, బ్రాస్ వెల్ 22 పరుగులు చేయగా, ఎనిమిది మంది కివీస్ బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటివకే భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో ఆడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News