Wednesday, December 18, 2024

కివీస్ రికార్డు విజయం

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో, చివరి టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ 423 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయం సాధించింది. 658 పరుగుల క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకే కుప్పకూలింది. 18/2 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కివీస్ బౌలర్లు సఫలమయ్యారు.

జాకబ్ బెల్, జో రూట్ అర్ధ సెంచరీలతో రాణించినా ఫలితం లేకుండా పోయింది. జాకబ్ 76 పరుగులు చేశాడు. రూట్ 54 పరుగులు సాధించాడు. గస్ అట్కిన్సన్ 43 పరుగులు చేశాడు. కెప్టెన్ స్టోక్స్ గాయం కారణంగా బ్యాటింగ్‌కు దిగలేదు. కివీస్ బౌలర్లలో మిఛెల్ సాంట్నర్ 4 వికెట్లు తీశాడు. మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథి రెండేసి వికెట్లను పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఓడినా ఇంగ్లండ్ 21తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలి రెండు టెస్టుల్లో ఇంగ్లండ్ జయకేతనం ఎగుర వేసిన సంగతి తెలిసిందే.

టెస్టులకు సౌథి గుడ్‌బై
మరోవైపు కివీస్ సీనియర్ బౌలర్ టిమ్ సౌథి టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతనికి సహచర క్రికెటర్లు ఘనంగా వీడ్కోలు పలికారు. సౌథి 107 టెస్టుల్లో కివీస్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ క్రమంలో 391 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లను 15 సార్లు, పది వికెట్లను ఒకసారి పడగొట్టాడు. అంతేగాక బ్యాటింగ్‌లో 2245 పరుగులు చేశాడు. ఇందులో ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News