Monday, January 20, 2025

కెర్మడెక్ దీవులలో 7.1 తీవ్రతతో భూకంపం… పొంచి ఉన్న సునామీ ముప్పు

- Advertisement -
- Advertisement -

న్యూజిల్యాండ్: న్యూ కెర్మడెక్ దీవులలో గురువారం ఉదయం 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం కేంద్రీకృతమైన ప్రాంతానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దీవులకు సునామీ ముప్పు పొంచి ఉన్నట్లు భూకంప పరిశోధనా కేంద్రం వెల్లడించింది. అయితే ఆస్ట్రేలియాకు వచ్చిన ముప్పేమీ లేదని తెలిపింది. అదేవిధంగా న్యూజిల్యాండ్‌కు కూడా సునామీ ప్రమాదమేమీ లేదని జాతీయ అత్యవసర నిర్వహణా సంస్థ ప్రకటించింది. గురువారం ఉదయం 6.25 గంటలకు(భారతీయ కాలమానం) భూకంపం సంభవించిందదని, భూమిలోపల 41 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైందని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News