Monday, March 10, 2025

కివీస్‌ని కట్టడి చేసిన బౌలర్లు.. భారత్ టార్గెట్ ఎంతంటే..

- Advertisement -
- Advertisement -

దుబాయ్: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత బౌలర్లు, ముఖ్యంగా స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన చేశారు. న్యూజిలాండ్ ఆటగాళ్లు భారీ చేయకుండా కట్టడి చేశారు. దీంతో న్యూజిలాండ్, భారత్‌కు 252 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టుకు ఓపెనర్లు విల్ యంగ్, రచిన్ రవీంద్రలు మంచి ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్‌కి వీరిద్దరు కలిసి 57 పరుగులు జత చేయగా.. ఈ జోడిని వరుణ్ చక్రవర్తి బ్రేక్ చేశాడు. వరుణ్ వేసిన 8వ ఓవర్‌లో విల్ యంగ్(15) ఎల్‌బిడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ వేసిన 11వ ఓవర్ తొలి బంతికే రచిన్ రవీంద్ర(37) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కుల్దీప్ వేసిన 13వ ఓవర్ రెండో బంతికి కేన్‌ విలియమ్‌సన్(11) కుల్దీప్‌కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఈ దశలో కష్టాల్లో పడిన జట్టుకు డెరెల్ మిచెల్ అండగా నిలిచాడు. భారత బౌలర్లను ఎదురుకుంటూ.. స్కోర్ సాధిస్తూ వచ్చాడు. మరోవైపు బ్యాటింగ్ చేస్తున్న టామ్ లాథమ్(14) జడేజా బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యూ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ కాస్త నిలికడగా ఆడినా.. 34 పరుగులు చేసి వరుణ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో డెరెల్ మిచెల్ అర్థ శతకాన్ని నమోదు చేశాడు. 101 బంతుల్లో 63 పరుగులు చేసిన అతను షమీ బౌలింగ్‌లో రోహిత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆఖర్లో బ్రేస్‌వెల్(53) మెరుపులు మెరిపించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఇండియా బౌలింగ్‌లో వరుణ్, కుల్దీప్ చెరి 2, షమీ, జడేజా తలో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News