Saturday, January 18, 2025

న్యూజిలాండ్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

మౌంట్ మాంగనూయ్: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ 281 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 528 పరుగుల క్లిష్టమైన లక్షంతో బుధవారం నాలుగో రోజు బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాను కివీస్ బౌలర్లు 247 పరుగులకే కుప్పకూల్చారు. కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు సాధించి డిక్లేర్డ్ చేసింది. ఈ క్రమంలో సఫారీ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు ఎడ్వర్డ్ మూరే (0౦, నీల్ బ్రాండ్ (3) విఫలమయ్యారు. ఈ దశలో రెనార్డ్, జుబేర్ హంజా కొద్ది సేపు వికెట్ల పతకాన్ని అడ్డుకున్నారు. అయితే రెనార్డ్ (31), హంజా (36)లను జేమిసన్ వెంటవెంటనే ఔట్ చేశాడు.

దీంతో సౌతాఫ్రికా 73 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ సమయంలో డేవిడ్ బెడింగ్‌హామ్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో కివీస్ బౌలర్లను కలవరానికి గురి చేశాడు. చెలరేగి ఆడిన బెడింగ్‌హామ్ 96 బంతుల్లోనే 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు సాధించాడు. ప్రమాదకరంగా మారిన అతన్ని జేమిసన్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా మళ్లీ కోలుకోలేక పోయింది. రువాన్ డి స్వార్డ్ 34 (నాటౌట్) తప్ప మిగతావారు విఫలమయ్యారు. దీంతో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 247 పరుగుల వద్దే ముగిసింది. కివీస్ బౌలర్లలో జేమిసన్ నాలుగు, సాంట్నర్ మూడు వికెట్లను పడగొట్టారు. ఈ గెలుపుతో న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News