Sunday, January 19, 2025

పాక్ కు న్యూజిలాండ్ భారీ టార్గెట్

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్ తో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ పోటీలో న్యూజీలాండ్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. ఒక దశలో రవీంద్ర, విలియమ్సన్ చెలరేగి ఆడటంతో స్కోరు పరుగులెత్తింది.  రవీంద్ర 94 బంతుల్లో 108 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్సర్,15 ఫోర్లు ఉన్నాయి. ఇక ప్రపంచ కప్ టోర్నమెంటులో ఒకే ఒక్క మ్యాచ్ ఆడి, గాయం కారణంగా వైదొలిగిన కెప్టెన్ విలియమ్సన్, ఈ మ్యాచ్ లో విశ్వరూపం చూపించాడు.

79 బంతుల్లో 95 పరుగులు చేసి, సెంచరీకి ఐదు పరుగుల దూరంలో ఇఫ్తికార్ అహ్మద్ బౌలింగ్ లో ఫఖర్ జమాన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఓపెనర్ కాన్వే 35, డరిల్ మిచెల్ 29, చాప్మన్ 39 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో హసన్ అలీ, ఇఫ్తికార్ అహ్మద్, హారిస్ రవూఫ్ తలో వికెట్ తీయగా, మహమ్మద్ వసీమ్ జూనియర్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రీదీకి ఒక్క వికెట్టూ దక్కకపోగా, 10 ఓవర్లలో 90 పరుగులివ్వడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News