వెల్లింగ్టన్: యువత సిగరెట్లు కొనడంపై న్యూజిలాండ్ జీవితకాలం నిషేధాన్ని విధించింది. ఈ మేరకు మంగళవారం చట్టాన్ని ఆమోదించింది. యువతను పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంచేలా ఈమేరకు న్యూజిలాండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చట్టం ప్రకారం ఉత్పత్తులు అమ్మడం నేరం. దీనివల్ల సిగరెట్టు కొనాలనుకునేవారికి ఉండాల్సిన సగటు వయసు గణనీయంగా పెరిగింది. ఈనేపథ్యంలో సిగరెట్లు కొనాలనుకునేవారికి కనీస వయసు 63సంవత్సరాలు ఉండాలి. ఈ మేరకు ధ్రువీకరణపత్రాన్ని చూపించాలి. ఈ చట్టంతో దేశంలో ధూమపానం నిర్ణీత గడువు కంటే ముందుగానే దూరమవుతుందని న్యూజిలాండ్ ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. న్యూజిలాండ్ 2025నాటికి రహిత దేశంగా ఉండేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
మరోవైపు కొత్తచట్టం విక్రయించే రిటైలర్ల సంఖ్యను 6000 నుంచి 600కు తగ్గించింది. సిగరెట్లులో అనుమతించిన నికోటిన్ శాతాన్ని కూడా తగ్గించింది. ధూమపానం కారణంగా భవిష్యత్తులో ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్యమంత్రి ఆయేషా వెర్రాల్ తెలిపారు. ధూమపానం కారణంగా వచ్చే క్యాన్సర్, గుండెపోటు తదితర రుగ్మతల నివారణకు ఆరోగ్యశాఖ ఖర్చు చేస్తున్న బిలియన్ డాలర్లు నిధులు మిగలడంతోపాటు.. మంచి ఆరోగ్యం అందించేందుకు ప్రభుత్వ నిర్ణయం ఉపయోగపడుతందని ఆమె తెలిపారు. అయితే లిబరేషన్ యాక్ట్ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. కాగా న్యూజిలాండ్‌లో స్మోకింగ్‌కంటే ఎక్కువగా పాపులర్ అయిన (ఈ సిగరెట్స్ ద్వారా పొగ పీల్చడం)కి మాత్ర ఈ చట్టం వర్తించకపోవడం గమనార్హం.