- Advertisement -
కరాచీ: ఐసీసీ నిర్వహిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ వైభవంగా ప్రారంభమైంది. కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో అతిధ్య పాకిస్థాన్ జట్టుతో న్యూజిలాండ్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌ను ప్రారంభించిన కివీస్ పది ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయింది.
పాక్ బౌలర్ అబ్రార్ అహ్మద్ వేసిన ఏడో ఓవర్ మూడో బంతికి కాన్వాయ్(10) క్లీన్ బౌల్డ్ అవ్వగా.. ఆ తర్వాత నజీం షా వేసిన 8వ ఓవర్ మొదటి బంతికే విలియమ్‌సన్ రిజ్వాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 12 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ జట్టు 2 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. క్రీజ్‌లో విల్ యంగ్(37), డరైల్ మిషెల్(5) ఉన్నారు.
- Advertisement -