- Advertisement -
దుబాయ్: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫి ఫైనల్ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అదరగొడుతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టుకు ఓపెనర్లు విల్ యంగ్, రచిన్ రవీంద్రలు మంచి ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్‌కి వీరిద్దరు కలిసి 57 పరుగులు జత చేయగా.. ఈ జోడిని వరుణ్ చక్రవర్తి బ్రేక్ చేశాడు. వరుణ్ వేసిన 8వ ఓవర్‌లో విల్ యంగ్(15) ఎల్‌బిడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ వేసిన 11వ ఓవర్ తొలి బంతికే రచిన్ రవీంద్ర(37) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కుల్దీప్ వేసిన 13వ ఓవర్ రెండో బంతికి కేన్ విలియమ్‌సన్(11) కుల్దీప్‌కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 13 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. క్రీజ్‌లో డెరెల్ మిచెల్(4), టామ్ లాథమ్(1) ఉన్నారు.
- Advertisement -