Monday, December 23, 2024

మూడో వికెట్ కోల్పోయిన కివీస్

- Advertisement -
- Advertisement -

 

అక్లాండ్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో కివీస్ 21 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 93 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు కవీస్ ముందు 307 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఫిన్ అలెన్ 22 పరుగులు చేసి శార్థూల్ టాకూర్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. డెవన్ కాన్వే 24 పరుగులు చేసి ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. డార్లీ మిచెల్ 11 పరుగులు చేసి ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కేన్ విలియమ్సన్(30), టామ్ లాథమ్(04) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News