Sunday, January 19, 2025

న్యూజిలాండ్ 345/7

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు కివీస్ జట్టు 81 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 345 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కివీస్ జట్టు 299 పరుగుల ఆధిక్యంలో ఉంది. రచిన్ రవీంద్ర సెంచరీతో చెలరేగాడు. డెవన్ కాన్వే హాఫ్ సెంచరీ చేయగా టిమ్ సౌథీ పర్వాలేదనిపించారు. కివీస్ బ్యాట్స్‌మెన్లలో రచిన్ రవీంద్ర(104 నాటౌట్), డెవన్ కాన్వే(91), టిమ్ సౌథీ(49 నాటౌట్), విల్ యంగ్(33), డారీల్ మిచెల్(18), గ్లెన్ ఫిలీప్స్(14), టామ్ లాథమ్(15), టామ్ బ్లండెల్(05), మ్యాట్ హెన్రీ(08) పరుగులు చేశారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, మహ్మాద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ తలో ఒక వికెట్ తీశారు. భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.

New Zealand loss seven wickets

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News