Sunday, December 22, 2024

ఆరో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్..

- Advertisement -
- Advertisement -

న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్పిన్నర్లు రాణిస్తున్నారు. దీంతో కివీస్ 6వ వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ శుభారంభం లభించింది.  తర్వాత భారత స్పిన్నర్లు కట్టుదిట్టమైన బంతులతో న్యూజిలాండ్ బ్యాటర్లపై ఒత్తడి తెస్తూ వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం 64 ఓవర్లలో కివీస్ 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర(65), డేవన్ కాన్వే(76)లు హాఫ్‌ సెంచరీలతో రాణించారు. క్రీజులో గ్లెన్ ఫిలిప్స్(01), మిచెల్ సాంట్నర్(04)లు ఉన్నారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ లు చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News