Monday, December 23, 2024

ఎంపీగా ఉంటూ ఇవేం బుద్ధులు!

- Advertisement -
- Advertisement -

పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఓ మహిళ దొంగతనాలు చేసి, తన పదవిని పోగొట్టుకున్నారు. న్యూజీలాండ్ కు చెందిన గోల్రిజ్ గహ్రమాన్ అనే ఎంపీ గ్రీన్ పార్టీనుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. చిన్నతనంలోనే న్యూజీలాండ్ కు వలస వచ్చిన గోల్రిజ్, న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. కొంతకాలం ఐక్యరాజ్య సమితిలో మానవ హక్కుల న్యాయవాదిగా పనిచేశారు. ఆమె 2017లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. గోల్రిజ్ ఎంపీగా గెలిచిన తొలి శరణార్థి మహిళ కావడం గమనార్హం.

అయితే ఆమెపై ఇటీవల దొంగ అనే ముద్ర పడింది. వస్త్ర దుకాణాలకువెళ్లి, అక్కడ చోరీలు చేస్తున్నారంటూ గోల్రిజ్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై విచారణ జరుగుతుండగానే, మంగళవారం ఆమె తన పదవికి రాజీనామా చేశారు. కొన్ని సందర్భాల్లో తన ప్రవర్తన భిన్నంగా ఉంటోందనీ, అందుకు పని ఒత్తిడే కారణమని గతంలో మానసిక వైద్యులు చెప్పారని ఆమె తెలిపారు. తాను చెప్పేవి సాకులు కావనీ, నిజాలనీ ఆమె అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News