- Advertisement -
దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తుది దశకు చేరుకుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ ఫైనల్స్‌లో తలపడుతున్నాయి. కాగా, ఈ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మాట్లాడుతూ.. ‘పిచ్ చాలా బాగుంది. మంచి స్కోర్ సాధిస్తాము.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి’ అని అన్నాడు. అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘ఇక్కడ మేం చాలా మ్యాచ్‌లు ఆడాము. మొదటి బ్యాటింగ్ కానీ, రెండో బ్యాటింగ్ అని కానీ మాకు తేడా ఏం లేదు’ అని అన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టులో ఒక మార్పు చేసింది. గాయంతో జట్టుకు దూరమైన మ్యాట్ హెర్నీ స్థానంలో నాథన్ స్మిత్‌ని జట్టులోకి తీసుకుంది. భారత్ అదే జట్టుతో బరిలోకి దిగుతుంది.
- Advertisement -