- Advertisement -
లాహోర్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గఢాఫీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై భారత ఘన విజయం సాధించి ఫైనల్‌కి చేరిన విషయం తెలిసిందే. ఈ రెండో సెమీఫైనల్‌లో గెలిచిన జట్టు భారత్‌తో ఆదివారం జరిగే ఫైనల్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా.. సౌతాఫ్రికా ఒక మార్పులు చేసింది. కెప్టెన్‌గా తెంబా బవుమా తిరిగి జట్టులోకి వచ్చాడు.
- Advertisement -