Wednesday, January 22, 2025

న్యూజిలాండ్ తో రెండో టెస్టు.. టీమిండియా బౌలింగ్

- Advertisement -
- Advertisement -

మూడు టెస్టుల సిరీస్ లో బాగంగా భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య మరికాసేపట్లో రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. పుణే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా ముందుగా బౌలింగ్ చేయనుంది.

ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న కవీస్ జట్టు ఈ మ్యాచ్ లోనూ గెలుపొంది సిరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు, తొలి మ్యాచ్ లో ఓటమిపాలైన టీమిండియా.. ప్రతికారం తీర్చుకునేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని పట్టుదలగా ఉంది.

జట్ల వివరాలు:

భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా.

న్యూజిలాండ్: టామ్ లాథమ్(సి), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(w), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News