Thursday, January 23, 2025

కష్టాల్లో న్యూజిలాండ్

- Advertisement -
- Advertisement -

New zealand Play with South Africa

 

క్రైస్ట్‌చర్చ్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ కష్టాల్లో చిక్కుకుంది. 426 పరుగుల భారీ లక్షంతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన న్యూజిలాండ్ సోమవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే కివీస్ మరో 332 పరుగులు చేయాలి. ఇప్పటికే కీలక వికెట్లు కోల్పోవడంతో చివరి రోజు మ్యాచ్‌ను కాపాడుకోవడం కివీస్‌కు కష్టమేనని చెప్పాలి. అయితే డెవోన్ కాన్వే 60 (నాటౌట్) క్రీజులో ఉండడం కాస్త ఊరటనిచ్చే అంశమే. అంతకుముందు సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 354 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. వికెట్ కీపర్ కిల్ వెరినె (136) అజేయ శతకం సాధించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News