Friday, March 14, 2025

హోలీ సంబరాల్లో పాల్గొన్న న్యూజిలాండ్ ప్రధాని లుక్సాన్

- Advertisement -
- Advertisement -

భారతదేశం అత్యంత ఘనంగా జరుపుకునే పండుగల్లో హోలీ ఒకటి. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా ఈ రంగుల పండుగ జరుపుకుంటారు. పరస్పరం రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో సంబురంగా గడుపుతార. ఇక విదేశాల్లో ఉండే భారతీయులు కూడా ఈ పండుగను ఘనంగానే జరుపుకుంటుండడం చూస్తుంటాం. ఇక న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లుక్సాన్ సైతం దేశ ప్రజలతో కలసి ఈ రంగుల పండుగను ఘనంగా జరుపుకున్నారు. 3& 2& 1 అంటూ క్లౌడ్ గులాల్ సిలిండర్ ఉపయోగించి జనంపై కివీస్ ప్రధాని రంగులు చల్లుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కాగా, ప్రధాని లుక్సాన్ పలు మార్లు భారత్‌ను ప్రశంసిస్తూ,

‘నేనే ఇండియాకు పెద్ద అభిమానిని& ఇది నేను ప్రేమించే, ఎంతో ఆరాధించే దేశం’ అని చెప్పారు. ఇక వాణిజ్యం, పెట్టుబడులు సహా కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవడానికి లుక్సాన్ ఈ నెల 16 నుంచి 20 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. ప్రధానిగా ఆయన భారత్‌కు రావడం కూడా ఇదే ప్రథమం. ఈ పర్యటనలో భాగంగా లుక్సాన్ 17న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకొని వాణిజ్యం, రక్షణ సహకారం, ప్రజల మధ్య సంబంధాల విస్తృతిపై చర్చించనున్నారు. అనంతరం ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా భేటీ కానున్నారు. లుక్సాన్ 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పర్యటించి తిరిగి వెల్లింగ్టన్‌కు పయనం అవుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News