- Advertisement -
వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్, టీమిండియాకు 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్ నైట్ స్కోరు 171/9తో మూడో రోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు మరో 3 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్ లో 174 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ మూడు వికెట్లు.. సుందర్, ఆకాశ్ దీప్ లు చెరో వికెట్ తీశారు. ఇక కివీస్ తొలి ఇన్నింగ్స్ లో 235 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ 263 పరుగులకు ఆలౌటైంది.
- Advertisement -