Sunday, December 22, 2024

న్యూజిలాండ్ లక్ష్యం 220

- Advertisement -
- Advertisement -

 

క్రైస్ట్‌చర్చ్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో టీమిండియా 47.3 ఓవర్లలో 219 పరుగులు చేసి ఆలౌటైంది. కివీస్ ముందు భారత జట్టు 220 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. బ్యాట్స్‌మెన్లు అందరు విఫలమైన వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్‌తో పర్యాలేదనిపించారు. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్, ఓపెనర్లు త్వరగా ఔట్ కావడంతో భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత బాట్స్‌మెన్లు వాషింగ్టన్ సుందర్(51), శ్రేయస్ అయ్యర్(49), శిఖర్ ధావన్(28), దీపక్ హుడా(12), శుభ్‌మన్ గిల్(13), అర్షదీప్ సింగ్(09), రిషబ్ పంత్ (10), సూర్యాకుమార్ యాదవ్(06), దీపక్ చాహర్(12), యుజేంద్ర చాహల్(08) పరుగులు చేశారు.  న్యూజిలాండ్ బౌలర్లలో అడమ్ మిల్నే, మిచెల్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా టిమ్ సౌథీ రెండు వికెట్లు, ఫరుగుజన్, మిచెల్ శాంట్నర్ తలో ఒక వికెట్ తీశారు. ఉమ్రాన్ మాలిక్ పరుగులేమీ చేయకుండా నాటౌట్‌గా నిలిచారు. ఇప్పటికే ఈ సిరీస్ లో న్యూజిలాండ్ జట్టు 1-0తో ముందంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News