Thursday, January 23, 2025

ఇండియాను ఓడించిన న్యూజిలాండ్ జట్టు

- Advertisement -
- Advertisement -

ముంబై: న్యూజిలాండ్ జట్టు మూడో రోజున మూడో టెస్టులో 3-0తో ఇండియా జట్టుపై వైట్వాష్ గెలుపును నమోదు చేసింది. ముంబైలో భారత జట్టు మరో చారిత్రాత్మక ఓటమిని నమోదు చేసింది. రిషబ్ పంత్ బాగానే ఆడినప్పటికీ ఫలితం లేకపోయింది. దీనికి ముందు రోహిత్ శర్మ(11),  శుబ్మన్ గిల్(1), విరాట్ కోహ్లీ(1) లకే ఔట్ అయ్యారు. 147 పరుగుల స్కోరును కూడా అందుకోలేకపోయారు. యశస్వి జైశ్వాల్(5), సర్ఫరాజ్ ఖాన్(1), రవీంద్ర జడేజా(6) కూడా ఏమంత స్కోరు అందించలేకపోయారు. రిషబ్ పంత్ ఒక్కడే బాగా ఆడినప్పటికీ ఫలితం దక్కలేదు. ఇదిలావుండగా న్యూజిలాండ్ తమ ఓవర్నైట్ స్కోరుకు కేవలం మూడు పరుగులు జతచేసి ఇండియా జట్టుకు లక్ష్యంగా 147 పరుగులు పెట్టింది.

న్యూజిలాండ్ (235& 174), ఇండియా జట్టును (263 & 121)…25 పరుగుల తేడాతో గెలిచి, 3-0 తో సిరీస్ స్వీప్ చేసింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News