Monday, December 23, 2024

తొలి వన్డేలో భారత్ ఓటమి

- Advertisement -
- Advertisement -

New Zealand thrashed India by 62 runs

క్వీన్స్‌టౌన్: న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టుకు ఓటమి ఎదురైంది. ఆతిథ్య న్యూజిలాండ్ 62 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో కివీస్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 48.1 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ సుజీ బేట్స్ అద్భుత సెంచరీతో జట్టును ఆదుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన బేట్స్ పది ఫోర్లతో 106 పరుగులు చేసింది. అమెలియా కేర్ (33), సాటర్‌వైట్ (63) తమవంతు పాత్ర పోషించారు. చివర్లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో కివీస్ ఇన్నింగ్స్ 275 పరుగుల వద్దే ముగిసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 49.4 ఓవర్లలో 213 పరుగులకే కుప్పకూలింది. ఒంటరి పోరాటం చేసిన కెప్టెన్ మిథాలీ రాజ్ ఆరు ఫోర్లతో 59 పరుగులు చేసింది. యస్తికా భాటియా (41) తప్ప మిగతావారు విఫలం కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. కివీస్ బౌలర్లలో జెస్ కేర్ నాలుగు వికెట్లు పడగొట్టింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News