Tuesday, December 3, 2024

కివీస్‌ బంగ్లా రెండో టి20 వర్షార్పణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బంగ్లాదేశ్‌ న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన రెండో టి20 వర్షం అర్ధాంతరంగా రద్దయ్యింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 11 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫిన్ అలెన్ (2), టిమ్ సిఫర్ట్ (43) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. డారిల్ మిఛెల్ (18), గ్లెన్ ఫిలిప్స్ (9) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ సమయంలో వర్షం రావడంతో ఆటను నిలపి వేశారు. ఆ తర్వాత వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో ఆట అక్కడే నిలిచిపోయింది. భారీ వర్షంతో బే ఓవల్ మైదానం పూర్తిగా చిత్తడిగా మారింది. పలుమార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు చివరికి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 10 ఆధిక్యంలో కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News