Thursday, January 23, 2025

కివీస్‌కు స్వల్ప ఆధిక్యం..

- Advertisement -
- Advertisement -

ఢాకా: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 8 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకు ఆలౌటైంది. జవాబుగా తొలి ఇన్నింగ్స్ చేపట్టిన న్యూజిలాండ్ శుక్రవారం మూడో రోజు 180 పరుగులు చేసింది. రెండో రోజు ఆట వర్షం వల్ల ఒక్క బంతి పడకుండానే రద్దయ్యింది. మూడో రోజు 55/5 స్కోరుతో తొలి ఇన్నింగ్స్ చేపట్టిన కివీస్‌ను గ్లెన్ ఫిలిప్స్ ఆదుకున్నాడు. బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఫిలిప్స్ 72 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 87 పరుగులు చేశాడు.

అతనికి జేమీసన్ (20), సౌథి (14) అండగా నిలిచారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన బంగ్లాదేశ్ శుక్రవార ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. ఓపెనర్ జాకీర్ హసన్ (16) క్రీజులో ఉన్నాడు. ఓపెనర్ హసన్ జాయ్ (2), కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో (15) పెవిలియన్ చేరారు. కాగా, బంగ్లాకు ఇప్పటి వరకు 30 పరుగుల ఆధిక్యం లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News