Wednesday, January 8, 2025

న్యూజిలాండ్‌కు సిరీస్

- Advertisement -
- Advertisement -

డునెడిన్: పాకిస్థాన్‌తో బుధవారం జరిగిన మూడో టి20లో ఆతిథ్య న్యూజిలాండ్ 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో కివీస్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలివుండగానే 30 తేడాతో సిరీస్‌ను దక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 224 పరుగులు సాధించింది. ఓపెనర్ ఫిన్ అలెన్ విధ్వంసక శతకంతో జట్టును ఆదుకున్నాడు. పాక్ బౌలర్లను హడలెత్తించిన అలెన్ 62 బంతుల్లోనే 16 భారీ సిక్సర్లు,

మరో ఐదు ఫోర్లతో 137 పరుగులు చేశాడు. ప్రత్యర్థి బౌలర్లను ఉతికి ఆరేసిన అలెన్ చిరస్మరణీయ శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మిగతా వారిలో సిఫర్ట్ (31), ఫిలిప్స్ (19) మాత్రమే రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. బాబర్ ఆజమ్ (58), నవాజ్ (28), రిజ్వాన్ (24) మాత్రమే కాస్త రాణించారు. మిగతావారు విఫలం కావడంతో పాక్‌కు హ్యాట్రిక్ ఓటమి తప్పలేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News