బెంగళూరు : ప్రపంచకప్‌లో భాగంగా శనివారం జరిగే కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలనే పట్టుదలతో పాకిస్థాన్ ఉంది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్ మూడింటిలో మాత్రమే విజయం సాధించింది. ఇందులో ఓడితే సెమీస్ రేసు నుంచి వైదొలుగుతోంది. మరోవైపు న్యూజిలాండ్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకంగా మారింది. చివరి మూ డు మ్యాచుల్లో కివీస్ వరుస పరాజయాలను చవిచూసింది. సౌతాఫ్రికాతో జరిగిన కిందటి మ్యాచ్ లో 190 పరుగుల తేడాతో అవమానకరీతిలో పరాజయం చవిచూసింది.
ఇలాంటి స్థితిలో పాకిస్థాన్‌ను ఓడించాలంటే న్యూజిలాండ్ సర్వం ఒడ్డి పోరాడక తప్పదు. భారత్, ఆస్ట్రేలియా, సఫారీల తో జరిగిన మ్యాచుల్లో కివీస్‌కు ఓటమి ఎదురైంది. అయితే పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్ ద్వారా వరుస ఓటములకు పుల్‌స్టాప్ పెట్టాలని కివీస్ భావిస్తోంది. కానీ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న పాకిస్థాన్‌ను ఓడించాలంటే సర్వం ఒడ్డి పోరాడక తప్పదు. వరుస ఓటములు కివీస్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఇలాంటి స్థితిలో పాక్‌తో పోరు న్యూజిలాండ్‌కు సవాల్‌గా మారింది. మరోవైపు పాకిస్థాన్ కూడా ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. సమష్టిగా రాణిస్తే కివీస్‌ను ఓడించడం పాక్‌కు పెద్ద కష్టమేమీ కాదనే చెప్పాలి.