Monday, December 23, 2024

న్యూజిలాండ్ దీటైన జవాబు

- Advertisement -
- Advertisement -

శ్రీలంకతో తొలి టెస్టు
గాలె: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పర్యాటక న్యూజిలాండ్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 91.5 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక ఓవర్‌నైట్ స్కోరుకు కేవలం మూడు పరుగులు మాత్రమే జోడించి మిగిలిన వికెట్లను కోల్పోయింది. కమిందు మెండిస్ (114), కుశాల్ మెండిస్ (50)లు జట్టును ఆదుకున్నారు. కివీస్ బౌలర్లలో విలియమ్ ఓ రొర్కె ఐదు వికెట్లను తీశాడు. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన న్యూజిలాండ్‌కు ఓపెనర్ టామ్ లాథమ్ అండగా నిలిచాడు.

మరో ఓపెనర్ డెవొన్ కాన్వేతో కలిసి తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించాడు. కాన్వే 17 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు కీలక ఇన్నింగ్స్ ఆడిన టామ్ లాథమ్ 111 బంతుల్లో ఆరు బౌండరీలతో 70 పరుగులు చేశాడు. సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 55 పరుగులు చేసి తనవంతు సహకారం అందించాడు. రచిన్ రవీంద్ర ధాటిగా ఆడి 4 ఫోర్లతో 39 పరుగులు చేశాడు. ఇక డారిల్ మిఛెల్ 41 (బ్యాటింగ్), వికెట్ కీపర్ టామ్ బ్లుండెల్ 18 (బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. దీంతో కివీస్ స్కోరు 4 వికెట్లకు 255 పరుగులకు చేరింది. కాగా, లంక తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే కివీస్ మరో 50 పరుగులు చేయాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News