Sunday, December 22, 2024

తొలి టి20 కివీస్‌దే

- Advertisement -
- Advertisement -

రాంచీ: భారత్‌తో శుక్రవారం రాంచీ వేదికగా జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ 10 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫిన్ అలెన్, కాన్వేలు శుభారంభం అందించారు. ధాటిగా ఆడిన అలెన్ 4 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 35 పరుగులు చేశాడు.

మరోవైపు కాన్వే ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 52 పరుగులు సాధించాడు.చివర్లో డారిల్ మిఛెల్ 5 సిక్స్‌లు, 3 ఫోర్లతో అజేయంగా 59 పరుగులు చేశాడు. దీంతో కివీస్ స్కోరు 176 పరుగులకు చేరింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేసింది. సూర్యకుమార్ (47), హార్దిక్ (21), సుందర్ (50)లు రాణించినా ఫలితం లేకుండా పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News