టిమ్ సౌథీ ఆశాభావం
మౌంట్‌మాంగనూయ్: మరో మూడో రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభంకానుంది. ఇప్పటికే ఈ టోర్నీ కోసం ఆయా వేదికలకు చేరుకొని చెమటోడుస్తున్నాయి. ఈ క్రమంలో న్యూజిలాండ్ మాజీ సారధి టిమ్ సౌథీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘ఫెవరేట్‌గా బిరలోకి దిగుతున్న న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుస్తుంది’ అని అశాభావం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్‌లో ఇటీవల ముగిసిన ముక్కోణపు సిరీస్‌లో న్యూజిలాండ్ రాణించింది. అదే జోరుతో ఛాంపియన్స్ ట్రో ఫీకి సన్నద్ధమవుతోంది. ముక్కొణపు సిరీస్‌లో కివీస్ కొత్త పేసర్లతో బరిలోకి దిగి ఆకట్టుకుంది.
అయితే ఇదే ఫామ్‌ను మెగా టోర్నీలోనూ కొనసాగిస్తే తప్పకుండా టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని సౌథీ అభిప్రాయపడ్డాడు. ట్రెంట్ బౌల్ట్, లాకీఫెర్గూసన్ గాయం కారణంగా ఈ మెగాటోర్నికి దూరమ్యారు. ఈ పరిస్థితుల్లో విల్ ఒరూర్‌కె, జాకబ్ డఫీ, నాథన్ స్మిత్, మాట్ హెన్రీ వంటి పేసర్లపై న్యూజిలాండ్ ఆశ లు పెట్టుకుందని సౌథీ తెలిపారు. ‘ఇప్పుడు ఈ యు వ ఆటగాళ్లపైబాధ్యత ఉంది. ఈ టోర్నమెంట్లలో భాగ ంగా ఉండడం చాలా ముఖ్యం. వారి ప్రదప్రర్శనపై నేను నమ్మకంగా ఉన్నాను అని సౌథీ తెలిపారు. అలా గే.. జట్టులో సీనియర్, జూనియర్ ఆటగాళ్లతో నిండిఉందని వ్యాఖ్యానించారు. న్యూజిలాండ్ ఎప్పుడూ ఐసిసి ఈవెంట్లలో పటిష్టంగా ఉంటుందన్నాడు.