Tuesday, November 5, 2024

న్యూజిలాండ్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

New Zealand won match against Namibia by 52 runs

 

షార్జా: ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో కివీస్ సెమీఫైనల్ బెర్త్‌కు మరింత చేరువైంది. ముందుగా బ్యాటింగ్ న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 111 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. కివీస్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేస్తూ స్కాట్లాండను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. ఓపెనర్లు స్టెఫాన్ బార్డ్, మిఛెల్ వాన్ లింగెన్‌లు స్కాట్లాండ్‌కు శుభారంభం అందించినా ఫలితం లేకుండా పోయింది. లింగెన్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు స్టెఫాన్ బార్డ్ రెండు ఫోర్లతో 21 పరుగులు చేసి వెనుదిరిగాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించారు.

ఆ తర్వాత కివీస్ బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టును ఆత్మరక్షణలో పడేశారు. కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేస్తూ స్కాట్లాండ్ బౌలర్లను కట్టడి చేశారు. దీంతో ఏ దశలోనూ స్కాట్లాండ్ పుంజుకోలేక పోయింది. వికెట్ కీపర్ జానె గ్రీన్ ఒక ఫోర్, సిక్సర్‌తో (23), డేవిడ్ వీస్ (16) మాత్రమే కాస్త రాణించారు. మిగతావారు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథి 4 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నె, మిఛెల్ సాంట్నర్‌లు కూడా పొదుపుగా బౌలింగ్ చేసి జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు.

ఆదుకున్న ఫిలిప్స్, నీషమ్

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసి న్యూజిలాండ్‌ను అనుకున్న దానికంటే తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో ప్రత్యర్థి బౌలర్లు సఫలమయ్యారు. ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్, డారిల్ మిఛెల్‌లు మెరుగైన ఆరంభాన్ని అందించలేక పోయారు. గుప్టిల్ ఒక ఫోర్, మరో సిక్స్‌తో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. మిఛెల్ రెండు ఫోర్లతో 19 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక కెప్టెన్ విలియమ్సన్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 28 పరుగులు చేసి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. వికెట్ కీపర్ కాన్వే (17) కూడా తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. అయితే చివరల్లో గ్లెన్ ఫిలిప్స్, నీషమ్ చెలరేగి ఆడారు. ధాటిగా ఆడిన ఫిలిప్స్ మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 21 బంతుల్లోనే 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నీషమ్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 35 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. దీంతో కివీస్ స్కోరు 163 పరుగులకు చేరింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News