Friday, November 8, 2024

కివీస్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

New zealand won on England team

బర్మింగ్‌హామ్ : ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను కివీస్ 10 తేడాతో కైవసం చేసుకుంది. భారత్‌తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ సమరానికి ముందు ఇంగ్లండ్ వంటి బలమైన జట్టును ఓడించడంతో న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈ గెలుపుతో టీమిండియాతో పోరుకు సమరోత్సాహంతో సిద్ధం కావాలని కివీస్ తహతహలాడుతోంది. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక ఇంగ్లండ్ 122 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 85 పరుగుల ఆధిక్యాన్ని సాధించిన కివీస్‌కు విజయం కోసం 38 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. దీన్ని న్యూజిలాండ్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. అంతకుముందు ఇంగ్లండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కివీస్ బౌలర్లు సఫలమయ్యారు. వీరి ధాటికి తట్టుకోలేక రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ తక్కువ స్కోరుకే కుప్పకూలింది. మార్క్‌వుడ్ 29 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఒలిపోప్ (23), ఒలి స్టోన్ (15), క్రాలి (17), కెప్టెన్ రూట్ (11) మాత్రమే రెండంకెలా స్కోరును అందుకున్నారు. మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 122 పరుగులకే పరిమితమైంది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, వాగ్నర్ మూడేసి వికెట్లు పడగొట్టారు. ఎజాజ్ పటేల్, బౌల్ట్ రెండేసి వికెట్లను తీసి ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో తమవంతు పాత్ర పోషించారు. తర్వాత స్వల్ప లక్ష్యాన్ని కివీస్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ టామ్ లాథమ్ 23 (నాటౌట్) జట్టును గెలిపించాడు.

ఆత్మవిశ్వాసం పెంచే విజయమిది..

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఘన విజయం సాధించడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ రాస్ టెలర్ పేర్కొన్నాడు. భారత్‌తో జరిగే డబ్లూటిసి ఫైనల్‌కు ముందు లభించిన ఈ విజయం తమకు పెద్దగా ఊరటినిస్తుందన్నాడు. ఇంగ్లండ్ వంటి బలమైన జట్టును వారి సొంత గడ్డపై ఓడించడం ఏ జట్టుకైనా చాలా కష్టంతో కూడుకున్న అంశమన్నాడు. అయితే తమ జట్టు దాన్ని ఆచరణలో చేసి చూపించడం గర్వంగా ఉందన్నాడు. ఈ గెలుపు అందించిన ఉత్సాహంతో భారత్‌తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమవుతామని రాస్ అన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News