Monday, December 23, 2024

భారత్ పై కివీస్ విజయం

- Advertisement -
- Advertisement -

 

అక్లాండ్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో కివీస్ ఘన విజయం సాధించింది. టీమిండియాపై న్యూజిలాండ్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత జట్టు నిర్దేశించిన 307 పరుగుల లక్ష్యాన్ని 47.1 ఓవర్లలో మూడు వికెట్ల కోల్పోయి ఛేదించింది. 47.1 ఓవర్లలో కివీస్ 309 పరుగులు చేసింది. టామ్ లాథమ్ సెంచరీతో విరుచుకపడ్డాడు. మూడో వికెట్ పై టామ్ లాథమ్, కెన్ విలియమ్సన్ 221 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కెన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లలో లాథమ్(145 నాటౌట్), కెన్ విలియమ్సన్(94 నాటౌట్), ఫిన్ అలెన్ (22), డెవన్ కాన్వే (24), డార్లీ మిచెల్ (11) పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ రెండు వికెట్లు పడగొట్టగా శార్థూల్ టాగూర్ ఒక వికెట్ తీశాడు. శతకం బాదిన లాథమ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News