Sunday, December 22, 2024

రెండో టెస్టులో కివీస్ గెలుపు

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో కివీస్ జట్టు గెలుపొందింది. రెండో ఇన్నింగ్స్ మూడో రోజు భారత జట్టు 60.2 ఓవర్లలో 245 పరుగులు చేసి ఆలౌట్ కావడంతో ఓటమిని చవిచూసింది. కివీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాట్స్ మెన్లు విలవిలలాడిపోయారు. కివీస్ బౌలర్ శాంట్నార్ ఆరు వికెట్లు తీసి భారత జట్టు నడ్డి విరిచాడు. యశస్వి జైస్వాల్ ఒక్కడే 77 పరుగులతో అదరగొట్టాడు. రవీంద్ర జడేజా 37 పరుగులతో పర్వాలేదనిపించాడు.
మిగిలిన బ్యాట్స్ మెన్లు స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. ఇప్పటికే ఈ సిరీస్ లో భారత్ జట్టు 2-0 తో వెనుకంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News