డూన్‌డిన్: న్యూజిలాండ్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మూడో టి20 మ్యాచ్‌లో ఫిన్ అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఊచకోత, విధ్వంసం అనే పదాలు ఫిన్ బ్యాటింగ్ దూకుడు ముందు చిన్నబోయాయి. ఫిన్ 62 బంతుల్లో 16 సిక్సర్లు, ఐదు ఫోర్ల సహాయంతో 137 పరుగులు చేశాడు. దీంతో న్యూజిలాండ్ 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి పాక్ ముందు 225 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీంతో పాక్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి ఓటమిని చవిచూసింది.
పాక్ బౌలర్లలో షహీన్ ఆఫ్రిది, హరీష్ రౌఫ్, మహ్మాద్ నవాజ్ పది స్ట్రయిక్ రేటుకు పైగా పరుగులు సమర్పించుకున్నారు. పాక్ బౌలర్లను ఫిన్ ఉతికి ఆరేశాడు. ఎక్కడ బంతి వేసిన సిక్స్ లేదా ఫోరుగా మలవడంతో బౌలింగ్ ఎలా చేయాలో పాక్ బౌలర్లకు అర్థం కాక తలలు పట్టుకున్నారు. 48 బంతుల్లోనే ఫిన్ సెంచరీ చేశాడు. న్యూజిలాండ్ తరపున అలెన్ 137 పరుగులతో తొలి స్థానంలో ఉండగా బ్రెండన్ మెక్‌కల్లమ్ 123 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆప్ఘానిస్తాన్ బ్యాట్స్‌మెన్లు హజ్రతుల్లా బజాయ్ రికార్డును సమయం చేశారు. 2019లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బజాయ్ 16 సిక్సర్లు బాదగా ఇప్పుడు ఫిన్ కూడా 16 సిక్సర్లు బాదాడు.