Sunday, December 22, 2024

రెండో వన్డేలో పాక్‌పై గెలిచిన కివీస్

- Advertisement -
- Advertisement -

 

కరాచీ: నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో కివీస్ ఘన విజయం సాధించింది. పాక్‌పై న్యూజిలాండ్ 79 పరుగుల తేడాతో గెలుపొందింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కాన్వే సెంచరీతో కదం తొక్కాడు. విలియమ్సన్ 85 పరుగులు, శాట్నర్ 37 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు సింగల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో న్యూజిలాండ్ 49.5 ఓవర్లలో 261 పరుగులు చేసి ఆలౌటైంది. 262 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు 43 ఓవర్లలో పది వికెట్లు కోల్పోయి 182 పరుగులు మాత్రమే చేసింది.

పాక్ బ్యాట్స్‌మెన్లు బాబర్ అజమ్ (79), రిజ్వాన్(28), సల్మాన్ (25), సోహేల్(10), ఉసామా మిర్ (12), వాషీమ్(10) పరుగులు చేశారు. పాక్ జట్టులో ఓపెనర్లు విఫలం కావడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. న్యూజిలాండ్ బౌలర్లలో సౌతీ, సోధీ చెరో రెండు వికెట్లు పడగొట్టగా పరుగుజన్, మిచెల్ శాంట్నర్, మిచెల్ బ్రాస్‌వెల్, గ్లెన్ ఫిలిప్స్ తలో ఒక వికెట్ తీశారు. పాక్ బౌలర్లలో నవాజ్ నాలుగు వికెట్లు పడగొట్టగా నషీమ్ షా మూడు వికెట్లు, హరీష్ రౌఫ్, ఉసామా మిర్ చెరో ఒక వికెట్ తీశారు. తొలి వన్డేలో పాక్, రెండో వన్డేలో న్యూజిలాండ్ గెలవడంతో సమజ్జీవులుగా ఉన్నారు. కాన్వేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News