Monday, December 23, 2024

కివీస్ ఇన్నింగ్స్ విజయం

- Advertisement -
- Advertisement -

New Zealand won second Test against Bangladesh

బంగ్లాదేశ్‌తో సిరీస్ సమం

క్రైస్ట్‌చర్చ్: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 117 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్‌ను కివీస్ 11తో సమం చేసింది. తొలి టెస్టులో బంగ్లాదేశ్ చారిత్రక విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక రెండో టెస్టును న్యూజిలాండ్ మూడు రోజుల్లోనే సొంతం చేసుకుంది. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 521 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన బంగ్లాదేశ్ 126 పరుగులకే కుప్పకూలింది. దీంతో బంగ్లాకు ఫాలోఆన్ తప్పలేదు. రెండో ఇన్నింగ్స్ చేపట్టిన బంగ్లాదేశ్‌ను కివీస్ బౌలర్లు మరోసారి తక్కువ పరుగులకే పరిమితం చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 278 పరుగులకే ఆలౌటైంది. జేమిసన్, వాగ్నర్‌లు అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. జేమిసన్‌కు నాలుగు, వాగ్నర్‌కు రెండు వికెట్లు దక్కాయి. బంగ్లాదేశ్ జట్టులో లిటన్ దాస్ ఒక్కడే పోరాటం చేశాడు. కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న దాస్ 14 ఫోర్లు, ఒక సిక్స్‌తో 102 పరుగులు సాధించాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత డబుల్ సెంరీ సాధించిన కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. డెవోన్ కాన్వే ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డును దక్కించుకున్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News