- Advertisement -
రావల్పిండి: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన ఉత్సహంలో ఉన్న న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లోనూ నెగ్గాలని భావిస్తోంది. మరోవైపు భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన బంగ్లాదేశ్ జట్టు ఈ మ్యాచ్‌తో తమ ఖాతా తెరవాలనే సంకల్పంతో ఉంది. ఈ మ్యాచ్ ఇరు జట్లు రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. కెలీ జేమిసన్, రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ జట్టులోకి రాగా.. మహ్మదుల్లా, నహిద్ రానా బంగ్లాదేశ్ జట్టులోకి వచ్చారు.
- Advertisement -