Wednesday, November 20, 2024

ఛాంపియన్ కివీస్

- Advertisement -
- Advertisement -

 ఫైనల్లో సౌతాఫ్రికాపై 32 పరుగులతో న్యూజిలాండ్ విజయం
 తొలిసారి వరల్డ్ కప్ టైటిల్ కైవసం

దుబాయ్: ఐసిసి మహిళ టి20 వరల్డ్ కప్ కలను న్యూజిలాండ్ నిజం చేసుకుంది. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో బ్యాటింగ్, బౌలింగ్‌లలో సమష్టిగా రాణించిన కివీస్ జట్టు 32 పరుగుల తేడాతో గెలుపొంది. తొలిసారి వరల్డ్ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. బ్యాట్‌తో 43 పరుగులు సాధించి అమేలియా కేర్ ఇటు బాల్ సౌతం రాణించి 3/24 ఆల్‌రౌండ్ షో చేసి న్యూజిలాండ్ విజయంలో కీలక భూమికపోషించింది. అమెలియాకు తోడు రోస్‌మెరీ మైర్ 3/25తో చెలరేగి సఫారీల నడ్డీ విరిచింది. దీంతో 158 పరుగుల లక్షానికి 32 పరుగుల దూరంలో ఆగిపోయింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో లారా వాల్కావర్డ్’(33), తాజ్మిన్ బ్రైట్(17)లు తప్ప మరెవరూ రాణించ లేకపోయారు. దాంతో తొలిసారి కప్ కొట్టాలన్న ఆశ నెరవేరకుండా పోయింది.

కవీస్‌కు శుభారంభం..

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఓపెనర్లు సుజీ బేట్స్(32), జార్జియా ప్లిమ్మర్(9)లు శుభారంభమిచ్చారు. ఇద్దరూ బ్యాట్ ఝళిపించి ఓవర్‌కు 8 పరుగులు రాబట్టారు. ధాటిగా ఆడుతున్న ఈ జోడీని అయబొంగా ఖాక విడదీసింది. జార్జీయా ప్లిమ్మర్‌ను క్యాచ్ రూపంలో ఔట్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన అమేలియా కేర్(43) బేట్స్‌కు జతకలవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. దాంతో, కివీస్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. అనంతరం సూజీ, కెప్టెన్ సోఫీ డెవిన్(6)లు తొందరగానే అయినా బ్రూకే హల్లిడే(38) అండగా అమేలియా కీలక భాగస్వామ్యాలు సాధించారు.

ఈ క్రమంలో హల్లిడే, అమేలియా జోరుతో 15వ ఓవర్లో న్యూజిలాండ్ స్కోర్ 100 దాటింది. నాలుగో వికెట్‌కు 57 పరుగులు కలిపిన ఈ జోడీని ట్రయాన్ విడదీసింది. దీంతో న్యూజిలాండ్ పరుగులు రాబట్టడంలో కొంచెం నెమ్మదించింది. ఇక లాబా వేసిన 19వ ఓవర్ తొలి రెండు బంతుల్ని బౌండరీకి పంపిన అమేలియా జట్టు స్కోర్ 140 దాటించింది. ఆఖరి ఓవర్లో మ్యాడీ గ్రీన్12 (నాటౌట్) సిక్సర్ బాదేసింది. దాంతో, కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి, భారీ లక్షాన్ని దక్షిణాఫ్రికా ముందు ఉంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News