వెల్లింగ్టన్: శ్రీలంకతో జరిగిన రెండో, చివరి టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 20తో క్లీన్‌స్వీప్ చేసింది. ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ చేపట్టిన శ్రీలంక 358 పరుగులకు ఆలౌటైంది. సోమవారం నాలుగో రోజు లంక ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చడంలో కివీస్ బౌలర్లు సఫలమయ్యారు. దినేశ్ చండీమల్, ధనంజయ డిసిల్వా వీరోచిత పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. సమన్వంయతో ఆడిన చండీమల్ 8 ఫోర్లతో 62 పరుగులు చేసి ఔటయ్యాడు.
మరోవైపు కీలక ఇన్నింగ్స్ ఆడిన ధనంజయ డిసిల్వా 185 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్స్‌తో 98 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రెండు పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మరోవైపు వికెట్ కీపర్ నిషాన్ మధుష్కా (39), కసున్ రజిత (20) పోరాటం చేసినా లంకకు ఇన్నింగ్స్ ఓటమి తప్పలేదు. కివీస్ బౌలర్లలో సౌథి, టిక్నర్ మూడేసి వికెట్లు తీశారు. కాగా, ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 580 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. అయితే లంక మొదటి లంక మొదటి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూలి ఫాలోఆన్ ఆడింది.