ఏ తల్లి కన్నదో.. ఎందుకు భారమైందో..
చింతపల్లిలోని ఓ పెంటకుప్పలో పసికందు మృతదేహం
కొండమల్లేపల్లి(చింతపల్లి): తల్లి ఒడిలో సేదతీరాల్సిన ఆ శిశువు విగతాజీవిగా పెంటకుప్పలో పడి ఉంది. తొమ్మిది మాసాలు గర్భంలో మోసిన ఆ తల్లి కర్కశత్వానికి ఈ నిదర్శనం. మానవత్వం మంటగలిసింది. ఆ చిన్నారిని ఏ తల్లి కన్నదో గాని అభం శుభం తెలియని పసిబిడ్డ బుధవారం చింతపల్లి మండల కేంద్రంలోని అతిథి గృహం సమీపంలో పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న పెంటకుప్పలో మగ మృతశిశువు స్థానికులకు కనిపించింది. సంతానం లేక కొందరు దేవుళ్లకు మొక్కులు తీర్చుకుంటూ వ్రతాలు నోములు చేస్తూ ఆసుపత్రుల చుట్టు తిరుగుతుంటే సంతాన ప్రాప్తి కలిగి కూడా ఇలాంటి దౌర్బాగ్య పరిస్థితి దిగజారిన వారిని వెంటనే పట్టుకుని కఠిన శిక్ష విధించాలని గ్రామస్తులు, ప్రజలు కోరుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రంలోని పలు ప్రభుత్వం కార్యాలయాలు పోలీస్ స్టేషన్, అతిథి గృహం, కనిపించగానే గుట్టుచప్పుడు కాకుండా గ్రామపంచాయతీ అధికారులు ఖననం చేశారు. అయితే పెంటకుప్పలో మృతి శిశువు లభ్యమవ్వడంపై స్థానిక ఐసిడిఎస్ ఆధికారులు శిశువు మరణంపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఐసిడిఎస్ ఆధికారులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పోలీసులు అనుమానస్పదన మృతిని భావించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కన్న తల్లిదండ్రులే చంపి పడేసారా లేక కిడ్నాప్‌కు గురి చేసి హత్య చేసి ఉంటారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.