Sunday, December 22, 2024

వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి

- Advertisement -
- Advertisement -

బెల్లంపల్లి : వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి చెందిన సంఘటన గురువారం బెల్లంపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట గ్రామానికి చెందిన రజితకు పురిటినొప్పులు రావడంతో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు డెలివరీ చేశారు. పుట్టగానే శిశువు పరిస్థితి విషమించింది. దీంతో శిశువును హుటాహుటిన అంబులెన్స్ లో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు శిశువును పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వైద్యులు తేల్చి చెప్పడంతో శిశువుతో మళ్లీ బెల్లంపల్లికి చేరుకున్నవారు  ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. శిశువు మృతి చెందడానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ వైద్యులపై మండిపడ్డారు.

డెలివరీ
చేసిన క్రమంలో వైద్యులు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించారు. కాన్సు సమయంలో సగభాగం రెండు గంటల పాటు అలాగే ఉంచడంతో శిశువు మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. ఎలాంటి సమస్య లేదని చెప్పిన వైద్యులు శిశువు పరిస్థితి బాగా లేదని ఆ తర్వాత చెప్పడంపై వైద్యులు తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారని స్పష్టమైందన్నారు. బెల్లంపల్లి ఆసుపత్రిలో వైద్యులు నాణ్యమైన వైద్యం అందిచడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా నవజాత శిశువు ప్రాణాలు ప్రాణాలు కోల్పోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News