Wednesday, April 2, 2025

వాటర్ ట్యాంకు కూలి ఐదుగురు కార్మికుల మృతి

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర పుణె జిల్లాలోని ఒక కార్మికుల శిబిరం వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక వాటర్ ట్యాంకు గురువారం ఉదయం కూలిపోయి ఐదుగురు కార్మికులు మరణించగా మరో ఐదుగురు గాయపడ్డారు. పింప్రీ ఛించ్‌వాడ్ పట్టణానికి చెందిన భోసారి ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. నీటి ఉధృతికి వాటర్ ట్యాంకుకు చెందిన గోడ పేలిపోయిందని, దీంతో ట్యాంకు కూలిపోయిందని పింప్రీ చించ్‌వాడ్ అదనపు పోలీసు కమిషనర్ వసంత్ పర్దేశీ తెలిపారు. వాటర్ ట్యాంకు కింద ఉన్న కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారని ఆయన చెప్పారు. ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు ఆసుపత్రిలో గాయాలతో మరణించారని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News