Thursday, December 5, 2024

రోడ్డు ప్రమాదంలో నవ వధువులు మృతి

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్  జిల్లా మూసాపేట మండలం అన్న సాగర్ వద్ద హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతులు అనంతపురం జిల్లా వాసులుగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి అనంతపురం వైపు కారులో వెళ్తుండగా మూసాపేట మండలం అన్నసాగర్ వద్ద లారీని ఓవర్ టేక్ చేస్తూ అదుపు తప్పి పక్కనున్న చెట్టుకు ఢీ కొట్టారు.

ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా ,మరో ఇద్దరు పరిస్థితి సీరియస్ గా ఉంది. వారిని స్థానికులు గుర్తించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు అనంతపురం జిల్లా ప్యాపిలి మండల ఎస్సై కూతురు అల్లుడుగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు .పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News