Wednesday, January 22, 2025

రంగారెడ్డిలో విషాదం.. నవ వధువు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మైలార్ దేవ్ పల్లిలో ఓ నవ వధువు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అత్త, మామల వరకట్న వేధింపుల కారణంగానే నవవధువు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానాకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News