- Advertisement -
బెంగళూరు: నవదంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన కర్నాటక రాష్ట్రం విజయపుర జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మే 22న హోనమళ్ల తెరడాలా అనే యువకుడు(31), గాయత్రి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. బంధువుల ఇంట్లో పుట్టిన రోజు వేడుకలు ఉండడంతో తన భార్యతో కలిసి బైక్‌పై వెళ్తుండగా డిసిఎం ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే ఇద్దరు చనిపోయారు. ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డిసిఎం వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: ‘జవాన్’ ఛాలెంజింగ్‌గా…
- Advertisement -