Tuesday, December 24, 2024

నాడు కరెంటు వస్తే వార్త … నేడు కరెంటు పోతే వార్త

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా విద్యుత్ విజయోత్సవాల్లో ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి
జడ్చర్ల : దేశ చరిత్రలోనే రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ అందించడం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకే సాధ్యమైందని ఎమ్మెల్యే డా. లకా్ష్మరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని చంద్ర గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో రైతే రాజు రైతు, దేశానికి వెన్నుముక అని రైతును పూర్తిగా నిర్లక్షం చేశారన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు కరెంటు వస్తే దినపత్రికల్లో వార్త వచ్చేదని, తెలంగాణ వచ్చాక ప్రస్తుతం కరెంటు పోతే వార్త అవుతుందని అన్నారు. ఎండాకాలం వచ్చిందంటే ఉక్కపోతతో సామాన్య ప్రజలు అల్లాడిపోయిన రోజును గుర్తు చేశారు. సిఎం కెసిఆర్ విజన్ , దూరదృష్టి వల్ల నేడు విద్యుత్ సమస్య లేకుండా చేశారన్నారు. దేశంలోనే రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. రైతులకు రైతుబంధు ఇస్తున్న కైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

అంతకు ముందు విద్యుత్ విజయోత్సవం సందర్భంగా విద్యుత్ పొదుపు వాడుక గురించి ఉద్యోగులతో కలిసి ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సిఈఓ జ్యోతి, మాజీ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మీ శివకుమార్, జడ్పీ వైస్ చైర్మన్ కోడ్గల్ యాదయ్య, మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రవీందర్, డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు ఉమాశంకర్‌గౌడ్, రమేష్, మాజీ సర్పంచ్ రేణుక , బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పిట్టల మురళి, రఘుపతిరెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News