Wednesday, January 22, 2025

ఎన్‌సిపిలో చీలిక వార్తలు అవాస్తవం: శరద్ పవార్

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: ఎన్‌సిపిలో చీలిక ఏర్పడనున్నట్లు వెలువడుతున్న వదంతులను ఆ పార్టీ అధినేత శరద్ పవార్ తోసిపుచ్చారు. పార్టీ నాయకుడు అజిత్ పవార్ బిజెపిలో చేరనున్నారని లేదా పార్టీలో కొందరు ఎమ్మెల్యేలతో కలసి వేరు కుంపటి పెట్టుకుని అధికార బిజెపికి మద్దతు ఇవ్వనున్నారంటూ వెలువడుతున్న వదంతులను శరద్ పవార్ మంగళవారం కొట్టివేశారు.

ఇవన్నీ నిరాధార ఊహాగానాలని, ఎటువంటి సమావేశం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్‌సిపిని బలోపేతం చేసే విషయమే తప్ప మరే ఇతర విషయాలు తమ మనసులో లేవని తన స్వస్థలం బారామతిలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడగా వ్యవహరిస్తున్న ఎన్‌సిపి సీనియర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అధికార బిజెపితో చేతులు కలపనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో శరద్ పవార్ నుంచి ఈ స్పంద వ్యక్తమైంది.

ఇలా ఉండగా..అజిత్ పవార్ తన ఫేస్‌బుక్, ట్విటర్ ప్రొఫెల్స్‌లో ఎన్‌సిపి లోగోను తొలగించడం చర్చనీయాంశమైంది. ఎన్‌సిపి ఎమ్మెల్యేలు పలువురు ముంబైకి బయల్దేరి వెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే 40 మంది ఎమ్మెల్యేల నుంచి అజిత్ పవార్ సంతకాలు సేకరించినట్లు వార్తలు వెలువడ్డాయి. కాగా, బారామతి నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలె పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News