Monday, January 20, 2025

న్యూజిలాండ్‌కు నాలుగో విజయం

- Advertisement -
- Advertisement -

చెన్నై : ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. బుధవారం ఎంఎ చిదంబరం స్టేడియంలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్ 149 పరుగుల తేడాతో ఘన విజయం సాదించింది. కిందటి మ్యాచ్‌లో ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించిన అఫ్గాన్ ఈసారి మాత్రం పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఓపెనర్ విల్ యంగ్ (54), కాన్వే (20), రచిన్ రవీంద్ర (32) పరుగులు చేశారు. డారిల్ మిఛెల్ (1) విఫలమయ్యాడు. అయితే కెప్టెన్ టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్‌లు అద్భుత ఆటతో అలరించారు. లాథమ్ 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. ధాటిగా ఆడిన ఫిలిప్స్ 4 సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 71 పరుగులు సాధించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 34.4 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. రహ్మత్ షా (36), అజ్మతుల్లా (27) మాత్రమే కాస్త రాణించారు. కివీస్ బౌలర్లలో సాంట్నర్, ఫెర్గూసన్ మూడేసి వికెట్లు తీశారు. బౌల్ట్‌కు రెండు వికెట్లు దక్కాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News