Wednesday, January 22, 2025

బెంగళూరులో విపక్ష తదుపరి భేటీ

- Advertisement -
- Advertisement -

ముంబై : ప్రతిపక్షాల తదుపరి భేటీ జులై 13, 14 తేదీలలో బెంగళూరులో జరుగుతుంది. పాట్నా భేటీ తరువాత సిమ్లాలో ప్రతిపక్ష నేతల సమావేశం ఉంటుందని తొలుత ప్రకటించారు. అయితే వచ్చే నెల 13, 14లలో ఈ భేటీ ఉందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శరద్ పవార్ గురువారం తెలిపారు. పాట్నాలో జరిగిన విపక్ష భేటీ తరువాత ప్రధాని మోడీకి కుదురు లేకుండా పోయిందన్నారు. మనశ్శాంతి లేదేమో అని వ్యాఖ్యానించారు. అన్నివిషయాలను పరిగణనలోకి తీసుకుని బెంగళూరులో ప్రతిపక్షాల భేటీని ఖరారు చేసినట్లు పవార్‌విలేకరులకు తెలిపారు. ఈ నెల 23న పాట్నాలో జరిగిన పాట్నా విపక్ష భేటీ అత్యంత కీలకమైనదని తెలిపిన పవార్ తరువాతి దశలో మరిన్ని భేటీలు ఉంటాయని సూచనప్రాయంగా తెలిపారు.

పాట్నాలో జరిగిన భేటీ దశలో పలు విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. అయితే సీట్ల సర్దుబాట్లు అత్యంత కీలక విషయం కానుంది. దీనిపై చర్చించుకునేందుకు సిమ్లాలో సమావేశం కావాలని పాట్నా భేటీలో నిర్ణయించారు. ప్రత్యేకించి ఐక్యతకు ఆయువుపట్టుగా ఉండే కనీస ఉమ్మడి కార్యక్రమం (సిఎంపి) గురించి ఖరారు చేసుకోవల్సి ఉంటుందని ఇందుకు సిమ్లా వేదికగా ఎంచుకున్నారు. అయితే ఇప్పుడు వేదిక మారింది. తదుపరి భేటీ బెంగళూరులోనే ఉంటుందని, దీనికి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే సారధ్యం వహిస్తారని వెల్లడైంది. ఈ దశ భేటీలో ప్రతిపక్ష ఐక్యతపై కార్యాచరణ ఖరారు కానుందని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News