Monday, January 20, 2025

ఇప్పటికన్నా వచ్చే ఏడాది మరింత వేడి

- Advertisement -
- Advertisement -

గత పదేళ్లుగా ప్రపంచ ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావడం పరిపాటిగా సాగుతోంది. ముఖ్యంగా ఈ పరిణామం 2014లో ప్రారంభమైంది. పారిశ్రామీకీకరణ ముందటి కాలం ఉష్ణోగ్రతల కన్నా 1.8 డిగ్రీల ఫారన్‌హీట్ వంతున ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది కన్నా వచ్చే 2023 సంవత్సరంలో ప్రపంచ ఉష్ణోగ్రతలు సరాసరిన 1.9 డిగ్రీలు2.3 డిగ్రీల ఫారన్‌హీట్ నుంచి 2.16 డిగ్రీల ఫారన్‌హీట్ వరకు నమోదు కావచ్చని వాతావరణ విభాగం పరిశోధకులు అంచనాగా వెల్లడిస్తున్నారు.

గత ఏడాది 2022 లో 1.7 డిగ్రీల నుంచి 2.1 డిగ్రీల ఫారన్‌హీట్ వరకు ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయని చెబుతున్నారు. ఈ విధంగానే ఆరేళ్ల క్రితం 2016లో రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. దీనికి కారణం వాతావరణాన్ని అతి శీతలీకరణ చేసే “లా నినా”అనే పరిణామం లోటు కావడం ఒక కారణంగా విశ్లేషిస్తున్నారు. భూమధ్య రేఖ నుంచి బలమైన గాలులు వెలువడి, తూర్పు నుంచి పశ్చిమ దిశగా పసిఫిక్ సముద్రం మీదుగా సాగితే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు బాగా చల్లబడతాయి.

దీనినే లా నినా అని శాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారు. ఈ లానినా లోటు భూతాపం పెరగడానికి దోహదం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతి మూడు నుంచి ఏడు సంవత్సరాలకు పసిఫిక్ సముద్ర ఉపరితలంపై లా నినా ప్రభావం ఉంటుంది. లా నినా ప్రభావం తోనే ఇండోనేసియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ప్రాంతాల్లో అసాధారణ వర్షాలు, పెనుతుపాన్లు, సంభవిస్తుంటాయి. సాధారణంగా శరదృతువు, లేదా శీతాకాల ప్రారంభంలో లా నినా ప్రభావం కనిపిస్తుంది.

గత మూడేళ్లుగా ప్రపంచ ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపించిన లా నినా ప్రభావం వచ్చే సంవత్సరానికి ముగిసిపోతుందని, అందుకే ఉష్ణమండల, పసిఫిక్ ప్రాంతాల్లో తిరిగి అనూహ్యమైన వేడి వాతావరణం విస్తరిస్తుందని పరిశోధకులు ముందస్తు అంచనా వేస్తున్నారు. లా నినా ప్రభావం తాత్కాలికమే తప్ప స్థిరంగా ఉండదు. ఈ అనూహ్య అసాధారణ వాతావరణ మార్పుల కారణం గానే 2022 కన్నా 2023 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డుకు ఎక్కుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News